పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ వద్ద ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ ''దేశ రాజధాని దిల్లీ కంటే వైశాల్యం, జనాభాలో హైదరాబాద్‌ పెద్దది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చెన్నై, దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే విద్యుత్‌ వచ్చిన నగరం హైదరాబాద్‌. చెన్నైకు 1927లో వచ్చింది. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్‌ సిటీ ఉన్న హైదరాబాద్‌, అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకుని విశ్వనగరంగా ఉంది. ఈరోజు మెట్రో రైలు ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ కోసం ముందుకు సాగడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో కృషి చేసిన మున్సిపల్‌, హెచ్‌ఎండీఏ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు సిబ్బందిని అభినందిస్తున్నా. చరిత్రలోనే కాదు, వర్తమానంలోనూ హైదరాబాద్‌ చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలోనూ లేని అద్భుతమైన సమశీతోష్ణ వాతావరణం ఇక్కడ ఉంటుంది. భూకంపాలు రాకుండా భూగోళంపై సురక్షితంగా ఉండే సిటీ హైదరాబాద్‌. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో గతంలో నగరం గొప్పగా ముందుకు వెళ్లలేదు. సమగ్రత అనేది లేకుండా చాలా విషయాల్లో బాధలు అనుభవించాం. గతంలో హైదరాబాద్‌లోని ఏ బస్తీకి వెళ్లినా మంచినీటి కోసం భయంకరమైన బాధలు చూశాం. విద్యుత్‌ కోసం ధర్నాలు జరిగిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒక్క క్షణం కూడా కరెంట్‌ పోకుండా నగరాన్ని పవర్‌ ఐలాండ్‌గా మార్చాం. న్యూయార్క్‌, పారిస్‌, లండన్‌లో కరెంట్‌ పోవచ్చు కానీ.. హైదరాబాద్‌లో పోదు. మెట్రో రైళ్లలో రోజూ నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరం. పరిశ్రమల రంగంలో నగరం దూసుకెళ్తోంది. ఐటీ రంగంలో సుమారు 500 గొప్ప పరిశ్రమలు కొలువుదీరుతున్నాయి. ఎస్‌ఆర్‌డీపీ కింద పనులు చేపట్టి ట్రాఫిక్‌ కష్టాలు తీర్చుకుంటున్నాం. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది'' అని కేసీఆర్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)