ఉమ్మడి పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Telugu Lo Computer
0


ఉమ్మడి పౌరసత్వం బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ప్రైవేటు బిల్లు ద్వారా రాజ్యసభలో చర్చకు వచ్చిన యునిఫాం సివిల్ కోడ్ బిల్లుపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఆ సందర్భంగా విపక్ష పార్టీల లీడర్లు వ్యతిరేకించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత నిర్మాణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ వేదికగా ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనుకూలంఆ 63 మంది ఓటు వేయగా వ్యతిరేకిస్తూ 23 మంది సభ్యులు ఓటు చేశారు. దీంతో బిల్లును ఆమోదిస్తూ తీర్మానం జరిగింది. యూనిఫాం సివిల్ కోడ్‌ను రూపొందించే ప్యానెల్ కు సంబంధించిన వివాదాస్పద ప్రైవేట్ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. భారతదేశం అంతటా యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలని ఆ బిల్లులోని సారాంశం. అయితే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రతిపక్ష సభ్యులు బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. దేశంలో ప్రబలంగా ఉన్న సామాజిక నిర్మాణాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని “నాశనం” చేస్తుందని ఆందోళన వ్యక్తపరిచారు.పలు బిల్లును ఆమోదిస్తోన్న పార్లమెంట్ ఈ శీతాకాల సమావేశాలను కీలకంగా తీసుకుంది. ఈ సమావేశాల్లోనే నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని తిరిగి ప్రవేశపెట్టే యోచన ఉందని సర్వత్రా వినిపించింది. కానీ, అలాంటి ఆలోచన లేదని కేంద్రం తెలిపింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు మొత్తం 17 పని దినాలతో కొనసాగుతాయి. ఈ సెషన్‌కు సంబంధించి కేంద్రం ఎజెండాలో 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిలో ప్రధానమైన బిల్లు యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు. దాన్ని 2020 రాజ్యసభ వ్యతిరేకించబడింది. ఆ రోజున బీజేపీకి ఎగువ సభలో పెద్దగా బలం లేకపోవడంతో వెనక్కు తగ్గింది. కానీ, ఈసారి ఓటింగ్ నిర్వహించడం ద్వారా బిల్లును ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య రాజ్యసభలో బీజేపీ సభ్యుడు కిరోరి లాల్ మీనా ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఓట్ల విభజన తర్వాత దీన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. భారత దేశం సరిహద్దుల్లోని పలు రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు ఉందని ఎంఐఎం భావిస్తోంది. ఇక నుంచి రొహంగ్యాల వంటి వాళ్లను కట్టడీ చేసేలా ఈ బిల్లు ఉంది. ఆ విషయాన్ని బీజేపీ చెబుతోంది. ప్రతి దేశానికి పౌరసత్వం ఉంటుంది. కానీ, భారత దేశంలో మాత్రం భిన్నమైన పౌరసత్వాలు ఉండేది. అందుకే, యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం రాజ్యసభ వేదికగా ఆమోదిచింది. ఆ విషయాన్ని బీజేపీ చెబుతోంది. ఇప్పటికే పలు కీలక బిల్లులను తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి బిల్లును తీసుకురావడం సంచలనం కలిగిస్తోంది. ఆర్డికల్ 370 రద్దు చేసిన బీజేపీ, నోట్ల రద్దు, జీఎస్టీ తదితర సంచలన నిర్ణయాలను తీసుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఉమ్మడి పౌరస్మృతి బిల్లు కూడా చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)