నా శాశ్వత నివాస ప్రాంతం భారత్ !

Telugu Lo Computer
0


భారత్ తన శాశ్వత నివాస ప్రాంతమని బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. ఇటీవల భారత్-చైనా సైనికుల మధ్య తవాంగ్ వద్ద చోటుచేసుకున్న ఘర్షణపై దలైలామా స్పందిస్తూ… ''యూరప్, ఆఫ్రికా, ఆసియాలో కొన్ని పరిస్థితుల విషయంలో సానుకూల మార్పులు వస్తున్నాయి. చైనా కూడా ఇప్పుడు కాస్త మెత్తగా మారింది. అయినప్పటికీ నేను మళ్ళీ చైనాకు వెళ్లే ప్రసక్తే కాలేదు. పండిత్ నెహ్రూ చూపించిన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్డా జిల్లా నేను నివసించడానికి అనువైన ప్రదేశం. ఇదేనా శాశ్వత నివాసం. ఇది చాలా మంచి ప్రదేశం'' అని అన్నారు. తన ఆరోగ్యం గురించి దలైలామా మాట్లాడుతూ తాను ఎడమచేతి నొప్పితో కొద్దిగా బాధపడుతున్నానని, అంతకు మించి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవని చెప్పారు. అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నానని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)