మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా ?

Telugu Lo Computer
0

అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. ప్లీజ్.. అంటూ మార్కెట్లో ఓ కుర్రాడు అడగడంతో  సరేనని మొబైల్ ఇచ్చాడో వ్యక్తి.. చివరకు.. | hey used to ask for mobiles from  strangers ...

స్కామర్లు ప్రజల మంచితనాన్ని అదునుగా చేసుకొని కొత్త కాల్ స్కాంను అదునుగా చేసుకున్నారు. ఇందులో, స్కామర్లు అత్యవసరం చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? అని అడుగుతారు. మీరు ఫోన్ ఇచ్చినట్లయితే వారు వెంటనే *21* లేదా *401* కి కాల్ చేస్తారు. అంతే, ఇక్కడ నుండి మీ ఫోన్ కాల్స్ మరియు మెసేజీలు వారి నంబర్ కి ఫార్వార్డ్ అవుతాయి. మీ ఫోన్ మెసేజీలు మరియు కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ ఇంపార్టెంట్ మెసేజీలు (OTP లాంటివి) మరియు కాల్స్ మరిన్ని వివరాలు స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఇంకేముంది మీ ఇన్ఫర్మేషన్ తో మీ జేబు ఖాళీ చేసేస్తారు. మీకు తెలియకుండా మీ ఫోన్ లో ఎవరైనా కాల్ ఫార్వార్డింగ్ సెట్ చేశారో లేదో మీరు చాలా సులభంగా చెక్ చేయవచ్చు. దీనికోసం, మీ ఫోన్ నుండి *#62# లేదా *#67# నంబర్ కు డయల్ చేయగానే మీ ఫోన్ లో అన్ని వివరాలు చూడవచ్చు. ఒకవేళ మీ ఫోన్ లో మీకు తెలియకుండా కాల్ ఫార్వార్డ్ సెట్ చేసినట్లయితే, మీరు చాలా సులభంగా దాన్ని తొలగించవచ్చు. దీనికోసం, మీ ఫోన్ నుండి *73 కి డయల్ చేయండి లేదా మీ ఫోన్ Settings లో Call > Call Forwarding లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్ అప్షన్ నుTurn Off చేయవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)