మోడీతో జగన్మోహన్ రెడ్డి భేటీ

Telugu Lo Computer
0


నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి వేంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు మంజూరు చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీలో మూడు రాజధానులపై చర్చించినట్లు సమాచారం. ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొన్న అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో జగన్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. రుషికొండ, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతుల విషయంపై జగన్ చర్చించారు. ''రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించాను. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరాను. ప్రధాని సానుకూలంగా స్పందించారు'' అని జగన్ ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)