వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య ట్వీట్ల వార్ !

Telugu Lo Computer
0


బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాంతారా, పుష్ప సినిమాలు బాలీవుడ్ ను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూ స్క్రీన్ షాట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..''బాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మిలార్డ్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించను. మీరు అంగీకరిస్తారా..?'' అంటూ అనురాగ్ కశ్యప్ ను ఉద్దేశించి వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. అయితే దీనికి ప్రతిగా అనురాగ్ కశ్యప్ '' సార్ ఇది మీ తప్పు కాదు. మీ సినిమాల పరిశోధన లాగే నా వ్యాఖ్యలపై మీరు చేసిన ట్వీట్లు ఉన్నాయి. మీ పరిస్థితి, మీ మీడియా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నెక్ట్స్ టైమ్ కాస్త సీరియస్ రీసెర్చ్ చేయండి'' అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. అనురాగ్ కశ్యప్ కామెంట్లపై మరోసారి వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. తన నాలుగేళ్ల పరిశోధన అబద్ధమని నిరూపించమని అనురాగ్ కశ్యప్ కు సవాల్ విసిరారు. '' ది కాశ్మీర్ ఫైల్స్ కోసం నాలుగేళ్ల పరిశోధన అంతా అబద్ధం అని నిరూపించండి. గిరిజా టికూ, బీకే గంజు, ఎయిర్ ఫోర్స్ కిల్లింగ్స్, నడిమార్గ్ అన్ని అబద్ధమని, 700 మంది పండితుల వీడియోలు అబద్ధమని, హిందువులు ఎవరూ చనిపోలేదు అని నిరూపించండి. నేను మరోసారి ఈ తప్పు చేయను'' అని సవాల్ విసిరారు వివేక్ అగ్నిహెత్రి. వీరిద్దరి ట్వీట్ వార్ మధ్య నెటిజెన్లు కూడా రెండుగా విడిపోయారు. కొంతమంది వివేక్ అగ్నిహోత్రికి మద్దతుగా నిలబడగా.. మరికొంత మంది అనురాగ్ కశ్యప్ కు అండగా నిలుస్తున్నారు. ఇరువర్గాలు కూడా పోటా పోటీగా కామెంట్స్ చేసుకుంటున్నారు. వివేక్ అగ్నిహోత్రి తీసిన ' ది కాశ్మీర్ ఫైల్స్' అఖండ విజయం సాధించింది. అనురాగ్ కశ్యప్ ఇటీవల దర్శకత్వం వహించిన తాప్సి నటించిన 'దోబారా' సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా చతికిలపడింది. చివరకు ఈ సినిమాకు పెట్టిన డబ్బులు కూడా రాలేదు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్' సినిమా షూటింగ్ ప్రారంభించారు. వచ్చే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)