దొరికిన ఎముకలు శ్రద్ధా వాకర్‌వే !

Telugu Lo Computer
0


మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికిన ఎముకలు శ్రద్ధా వాకర్‌వే అని తేలింది. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి విశ్లేషణకు పంపారు. తాజాగా శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయింది. దీంతో ఆ ఎముకలు శ్రద్ధావే అని తేలింది. ఇప్పటికే పాలిగ్రాఫ్, నార్కో పరీక్షల్లో శ్రద్ధాను తనే చంపినట్లు అఫ్తాబ్ పూనావాాలా వెల్లడించాడు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ముందుగా ఆధారాలు వెతికే పనిలో శ్రద్ధాకు సంబంధించిన ఎముకలను సేకరించారు. దవడ ఎముకతో పాటు 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఫొరెన్సిక్ విశ్లేషణకు పంపారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధా వాకర్ ని ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాల మే 18న అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం బాడీని 35 ముక్కులుగా చేసి మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12న అఫ్తాబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ నేతలు ఈ హత్యలో లవ్ జీహాద్ కోణం ఉందని ఆరోపించారు. దీంతో ఈ సంఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసులో తానే శ్రద్ధాను హత్య చేసినట్లు వెల్లడించాడు అఫ్తాబ్. తన నుంచి శ్రద్ధా దూరం అవుతుందనే ఇలా చేశానని తెలిపాడు. శ్రద్ధాతో రిలేషన్ లో ఉండగానే మరో హిందూ యువతులను ట్రాప్ చేసినట్లు అంగీకరించాడు. శ్రద్దా శరీర భాగాలను ఫ్రిజ్ లో ఉంచి, మరో అమ్మాయితో అదే ప్లాట్ కు తీసుకువచ్చినట్లు వెల్లడించాడు. డేటింగ్ యాప్ ద్వారా పలువురిని ట్రాప్ చేసినట్లు పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల్లో అంగీకరించాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)