భారత్‌ జోడో యాత్రను వాయిదా వేసుకొండి !

Telugu Lo Computer
0

కరోనా వైరస్‌ టెన్షన్‌ ఇంకా కొనసాగుతోంది. కొద్దిరోజులుగా డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో, చైనాలో ఇప్పటికే పలు పాంత్రాల్లో లాక్‌డౌన్‌ సైతం విధించి చైనీయులపై అక్కడి సర్కార్‌ ఆంక్షలు సైతం విధించింది. ఈ తరుణంలో కరోనా కేసులు విషయంలో భారత ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. కరోనా కేసులు పెరుగుతాయనే వైద్య నిపుణుల సూచనలు నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవీయా కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను సైతం వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగానే భారత్‌ జోడో యాత్ర.. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ చేసుకోవాలని, టీకా వేసుకున్న వారే ఈ యాత్రలో పాల్గొనాలని, లేని పక్షంలో యాత్రను వాయిదా వేసుకోవాలని లేఖలో రాహుల్‌ కోరారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాండవీయా లేఖపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. దిగ్విజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ కరోనా విషయంలో దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారా?. దేశంలో బహిరంగ సభలు పెట్టకూడదనే షరతు ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ నేతలకు వర్తిస్తాయా?. దేశంలో మరోసారి కరోనా లాక్‌డౌన్‌ విధించబోతున్నారా? అంటూ ప్రశ్నలు సంధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)