కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి వుంది !

Telugu Lo Computer
0

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వైద్య నిపుణులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైరస్‌ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. సీనియర్‌ సిటిజన్లు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించారు. అంతకు ముందు.. పరిస్థితి ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ మాండవీయా ట్వీట్‌ చేశారు. ఇక కోవిడ్‌పై ప్రధానంగా జరిగిన హైలెవల్‌ రివ్యూలో మంత్రితో పాటు అధికారులంతా మాస్కులు ధరించి ఉండడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)