మైసూరులో ఏసుక్రీస్తు విగ్రహం ధ్వంసం

Telugu Lo Computer
0


బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మతాల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. హిందూ, ముస్లింల మధ్య అనేకసార్లు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అప్పుడప్పుడు క్రైస్తవ మతం విషయంలో కూడా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. మైసూరులోని ఒక చర్చీలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. క్రిస్మస్ జరిగిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం. మంగళవారం సాయంత్రం మైసూరు జిల్లాలోని పెరియపట్న పట్టణంలో ఉన్న చర్చీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బలిపీఠం వద్ద ఉంచిన ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే చర్చిలోని జీసస్ ప్రధాన విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చర్చి పాస్టర్ లేని సమయంలో ఈ విధ్వంసం జరిగిందని, విగ్రహ ధ్వంసంతో పాటు విరాళం పెట్టెలోని డబ్బు కూడా కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు విచారణ ప్రారంభించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై మైసూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీమా లత్కర్ మాట్లాడుతూ “నిందితులను పట్టుకోవడానికి మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేసాము. చర్చి సమీపంలోని కెమెరాలతో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాము. విరాళం పెట్టెలోని డబ్బుతో పాటు చర్చిలోని ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. తదుపరి విచారణ కొనసాగుతోంది” అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)