ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో మోదీ పుట్టిన గ్రామం వాద్ నగర్ !

Telugu Lo Computer
0

Modi's birthplace makes Unesco heritage 1 st cut | India News - Times of  India

యునెస్కో మన దేశంలో పలు ప్రాంతాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలమైన గుజరాత్ లోని వాద్ నగర్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరింది. ఇదే విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు మొతెరాలోని సూర్య దేవాలయం, త్రిపుర లోని ఉనకోటి కూడా ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందినట్లు ఏఎస్ఐ తెలిపింది. ఇటీవలే ధోలవీర, రామప్ప దేవాలయం సాంస్కృతిక విభాగంలో యునెస్కో జాబితాలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యునెస్కో తాత్కాలిక జాబితాలో లో మరో మూడు ప్రాంతాలు చేరాయి. వీటిలో గుజరాత్ లోని వాద్ నగర్, మొతెరాలోని ఐకానికి సన్ టెంపుల్, త్రిపురలోని ఉనకోటి రాతిశిల్పాలు ఈ తాత్కాలిక జాబితాలో చేరాయి. ఈ విషయానికి సంబంధించి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం భారతదేశం నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో 52 ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం యునెస్కో జాబితాలో ఉన్న ప్రదేశాలు భారతదేశలోని గొప్ప సాంస్కృతిక, సహజ సంపదను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. భారత్ లోని మరిన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితా చేర్చడం కోసం ఏఎస్ఐ చేస్తున్న కృషిని కిషన్ రెడ్డి అభినందించారు. సాధారణంగా యునెస్కో.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతిపాదనలు అన్ని రకాలుగా పరిశీలించిన మీదట తగిన అర్హతలు ఉన్న వాటికి జాబితాలో చోటు కల్పిస్తుంటుంది. సాంస్కృతిక, చారిత్రకంగా తగిన అర్హతలు ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే యునెస్కో తాత్కాలిక జాబితాలో మనదేశం నుంచి ఈ మూడు ప్రాంతాలకు చోటు దక్కింది.

Post a Comment

0Comments

Post a Comment (0)