రాక్షసానందం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 21 December 2022

రాక్షసానందం !

జంతువులపై మనుషులు చేసే అకృత్యాలకు నెటిజన్లు కలవరపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో షేర్ చేయబడింది. ఇది చూసేవారికి చాలా ఆశ్చర్యంగా, షాకింగ్‌ కూడా ఉంది.  వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోమారు వైరల్‌ అవుతోంది. అందులో ఒక వ్యక్తి తన మూర్ఖపు చర్యతో మనుషుల్లో మానవత్వానికి మచ్చను తెచ్చేలా చేశాడు. ఆ వీడియోలో కనికరం లేని ఓ వ్యక్తి కుక్కను రెండు చెవులను పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టడం మనకు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్ల గుండెలు బద్దలవుతున్నాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో, ఒక వ్యక్తి అమాయక కుక్కను దాని చెవి పట్టుకుని పైకి లేపాడు. అందులో కుక్క నొప్పితో మూలుగుతూ కనిపించింది. ఇది చూస్తే మన రక్తం ఉడికిపోతుంది. దీంతో చలించిన పోయిన మరో మూగజీవి ఆవు కుక్కకి సహాయం చేయడానికి వచ్చింది. సాయం కోసం ఏడుస్తున్న కుక్కను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మరో జంతువు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వీడియోలో, ఒక ఆవు కుక్కకు సహాయం చేయడాన్ని చూడవచ్చు. కుక్కపై జరిగిన క్రూరత్వాన్ని చూసిన ఆవు గుండెలేని మనిషిపై కొమ్ములతో దాడి చేస్తుంది. ఆపై అతన్ని దూరంగా విసిరివేసింది. తనపై దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తి కుక్కను వదిలేశాడు. ఆ వీడియోలో ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా, 'హృదయం లేని వ్యక్తి చేసిన పనికి… కర్మకు శిక్ష పడింది' అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 6 లక్షల వ్యూస్‌, టన్నుల కొద్దీ లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జంతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది మంచి గుణపాఠం అని మరొకరు ట్విట్‌ చేశారు.

No comments:

Post a Comment