విజయవాడలో అమానవీయ ఘటన ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 21 December 2022

విజయవాడలో అమానవీయ ఘటన !

Vijayawada Pregnant Women: Pregnant Women gave birth to a child on the  floor after Vijayawada Government Medical Staff Negligence | Vijayawada  Pregnant Women: నొప్పులు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైద్య ...

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అరుణ అనే గర్భిణి మహిళ పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెని పట్టించుకోకపోవడంతో గర్భిణి మహిళ ఆస్పత్రి ఆవరణంలో ప్రసవించింది. దీంతో పసికందు కింద పడడంతో గాయపడింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది శిశువు, మహిళను జనరల్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలన పసికందు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణ భర్త , కుటుంబ సభ్యులు పసికందు ఆరోగ్య పరిస్థితి తమకు చెప్పడం లేదని ఆందోళన చేశారు. ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ గర్భిణి స్త్రీ అరుణ వాంతులు చేసుకుంటూ కారిడార్‌లో గర్భిణీ ప్రసవించగానే అక్కడ ఉన్న సిబ్బంది స్ట్రెచర్‌లో లోపలికి తీసుకెళ్లారని చెప్పారు. శిశువు క్షేమంగా ఉందని, ఎనిమిదో నెలలో ఆమె ప్రసవించిందని డాక్టర్ తెలిపారు. ఇందులో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏమి లేదన్నారు.

No comments:

Post a Comment