వివాహాన్ని రద్దు చేసిన షాంపూ !

Telugu Lo Computer
0


అసోం లోని గువాహటికి చెందిన ఓ ఇంజినీర్‌తో ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఈ నెల 14న వారి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు విలువైన బహుమతులతో పాటు కొన్ని వస్తువులను పెళ్లి కూతురుకు వరుడి కుటుంబ సభ్యులు పంపించారు. ఆ వస్తువుల్లో షాంపూ కూడా ఉంది. కానీ అది చాలా తక్కువ రేటుది. దీంతో వధువుకు కోపం వచ్చింది. నీ స్థాయి ఇంతేనా అంటూ వరుడికి వాట్సాప్‌లో మేసేజ్ పంపింది. తీవ్ర మనస్తాపానికి గురైన వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా వరుడు తన మనసును మార్చుకోలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)