డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పై చర్చించాం : జైశంకర్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 20 December 2022

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పై చర్చించాం : జైశంకర్


గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమవడం పట్ల హర్షం జైశంకర్ వ్యక్తం చేశారు. భారత దేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాల గురించి చర్చించినట్లు ట్వీట్‌లో తెలిపారు. పిచాయ్ భారత దేశ పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో సమావేశమయ్యారు. ఇన్నోవేషన్, తదితర అంశాలపై మోదీతో చర్చించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత దేశానికి వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చించారు. ఈ సమావేశం అనంతరం పిచాయ్ ఇచ్చిన ట్వీట్‌లో మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీ నాయకత్వంలో అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు అమల్లోకి వస్తుండటం గొప్ప ప్రేరణనిస్తోందన్నారు. అందరికోసం పని చేసే ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు భారత దేశ జీ20 ప్రెసిడెన్సీకి సహకరిస్తామన్నారు. భారత దేశంతోగల బలమైన భాగస్వామ్యం కొనసాగాలని ఆకాంక్షించారు. జీ20 ప్రెసిడెన్సీని భారత దేశం డిసెంబరు 1న స్వీకరించింది. ఇది గొప్ప బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోంది. మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, సుందర్ పిచాయ్‌తో సమావేశమై, ఇన్నోవేషన్, టెక్నాలజీ తదితర అనేక అంశాల గురించి చర్చించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచం మానవ సౌభాగ్యం, సుస్థిర అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం కోసం కృషిని కొనసాగించడం ముఖ్యమని తెలిపారు. 

No comments:

Post a Comment