డబ్బు తిరిగి అడిగినందుకు నోట్లో పినాయిల్ పోశారు !

Telugu Lo Computer
0


ముంబైలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న నలుగురు వ్యక్తులు యజమానిని చితకబాదారు. ఆపై అతని నోట్లో పినాయిల్ పోశారు. దీంతో ‍అతని పేగులు కాలి తీవ్ర కడపునొప్పితో ఇబ్బందిపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. ముంబై శివాజినగర్‌లో మంగళవారం రాత్రి 7-30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే యజమానికి అతని ఇంట్లో అద్దెకుండే వాళ్లు డబ్బులిచ్చారు. చాలా రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్లు అతనితో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం మాటామాటా పెరిగింది. అద్దెకు ఉండే నలుగురు కలిసి అతన్ని గోడకు నెట్టేశారు. అనంతరం ఒకరు యజమాని నోట్లో బలవంతంగా పినాయిల్ పోశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులపై హత్యాహత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు సియాన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)