బిడ్డకు మా పోలికలు ఎందుకు లేవు డాక్టర్ ?

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన హన్నా డోయల్ అనే మహిళకి మూడు నెలల క్రితం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి జాండర్ అనే పేరు పెట్టుకున్నారు. అయితే జాండర్ పుట్టినప్పుడే కాస్త డిఫరెంట్ గా కనిపించాడు. ఈ విషయాన్ని హన్నా సీరియస్ గా తీసుకోలేదు. బాబు పుట్టినప్పుడు మెడ వెనుక భాగంలో గడ్డ కనిపించింది. ఆందోళన చెందిన హన్నా వైద్యులకు విషయాన్ని చెప్పింది. శిశువును పరీక్షించిన వైద్యులు ఆ గడ్డ వల్ల బాబుకు ప్రమాదమేమి లేదని చెప్పి, ఇంటికి పంపించారు. అయితే ప్రతిరోజూ హన్నా బాబులో మార్పులు గమనించి ఏదో తేడాగా ఉందనుకుని మరోసారి వైద్యుల దగ్గరకు వెళ్ళింది. బాబు నా పోలికలతోనూ, నా భర్త పోలికలతోనూ లేకుండా ఎలా ఉన్నాడు. కనీసం ఏదో ఒక పోలిక అయినా బాబులో కనిపించాలి కదా ! అసలు సమస్య ఏమిటో చెప్పాలని వైద్యులను కోరింది. దీంతో చేసేదేమీ లేక వైద్యులు చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షా ఫలితాల్లో  బాబుకు చాలా అరుదైన వ్యాధి ఉన్నట్టు తేలింది. అరుదైన క్రోమోజోమ్ ఉందట, దీనికారణంగా బాబుకు డిలీషన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చిందని తెలిసి డాక్టర్లు అవాక్కయ్యారు. కాగా అప్పటికే మూడు నెలల జాండర్ కు గుండె సంబంధ సమస్య కూడా ఉంది. బాబుకు గుండెలో రంధ్రం ఉందని హన్నా వెల్లడించింది. అయితే బాబుకు అరుదైన వ్యాధి ఉన్నట్టు బయటపడినా బాబులో స్పందనలు మాత్రం సాధారణంగానే ఉండటం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)