తాగి బండి నడిపితే రూ.10 వేల జరిమానా !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలో డిసెంబరు 31 రాత్రి నుంచి జనవరి 1 వరకూ పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బేగంపేట్‌, లంగర్‌హౌస్‌ మినహా అన్ని పై వంతెనలపై రాకపోకలు నిలిపివేయనున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో దొరికిపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ టి.శ్రీనివాసరావు తెలిపారు. మొదటిసారి చిక్కితే రూ.10,000 జరిమానా, 6 నెలల జైలుశిక్ష, రెండోసారైతే రూ.15,000, 2 సంవత్సరాల శిక్ష తప్పదన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సీజ్‌ చేసి సస్పెన్షన్‌కు రవాణా శాఖకు పంపుతామన్నారు. మొదటిసారి 3 నెలల సస్పెన్షన్‌, రెండోసారి పట్టుబడిన వారి లైసెన్స్‌ శాశ్వతంగా రద్దవుతుందన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని డీసీపీ సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)