హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ ?

Telugu Lo Computer
0

హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిని సీనియర్‌ నాయకుడు సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుకే కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ మొగ్గిచూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌లో 35 సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా కాంగ్రెస్‌ 40 సీట్లలో గెలుపొందింది. అయితే సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. పలువురు నేతలు సీఎం పదవికి కోసం ప్రయత్నాలు చేశారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ సతీమణి, పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ సీఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆమెనే సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రచారం జరిగింది. అటు సుఖ్విందర్‌ సింగ్‌ కూడా తాను సీఎం పదవి రేసులో లేనని కొన్ని గంటల క్రితమే ప్రకటించారు. ఇంతలో కాంగ్రెస్ హైకమాండ్‌ సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పేరును సీఎంగా ఖరారు చేసిందన్న వార్తలు వెలువడటం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)