పెళ్లి వాయిదా పడేలా చేసిన సెల్ఫీ మోజు... !

Telugu Lo Computer
0


కేరళ లోని కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్‌ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 9న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజల అనంతరం దగ్గర్లోని అయిరవల్లి క్వారీని చూసేందుకు వెళ్లారు. అక్కడ వధూవరులిద్దరూ సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకోబోయేలోపు వధువు శాండ్ర 120 అడుగుల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. ఆమెను కాపాడేందుకు వరుడు సైతం అందులోకి దూకేశాడు. నీటిలో మునిగిపోతున్న శాండ్రాను కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్పగాయాలతో ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనతో శుక్రవారం జరగాల్సిన వివాహం కాస్తా వాయిదా పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)