నాలుగోసారి శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్ !

Telugu Lo Computer
0


2022 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారతదేశంలో ఆరుగురికి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కగా అందులో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ముందు వరుసలో నిలిచారు. నిర్మల సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇది వరుసగా నాలుగో సారి. నిర్మల సీతారామన్ తో పాటు భారత దేశం నుంచి బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకులు ఫల్గుణి నాయర్, సెబి చైర్ పర్సన్ మదాభి పురి బచ్, హెచ్ సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మొండల్ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ తొలి స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డే రెండవ స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ మూడో స్థానంలో నిలిచారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)