ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కృషి !

Telugu Lo Computer
0


దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు. మెయిన్‌పురి నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో అఖిలేశ్‌ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి ఎగబాకడంతోపాటు నిరుద్యోగం పెరుగుతోందని చెప్పారు. 2024 కోసమని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు నిరంతర కసరత్తు జరుగుతోందని, బీహార్ సీఎం నీతీశ్ కుమార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగానే కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. "ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేసింది. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడులు గుర్తొచ్చాయా'' అని విమర్శలు గుప్పించారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలను కూడగట్టేందుకు ఇప్పటికే నితీశ్ కుమార్ పలువురితో చర్చలు జరిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని పలు నియోజక వర్గాల నుంచి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పర్యటిస్తూ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)