ఓటేయడానికి వచ్చి రోడ్‌షోనా ?

Telugu Lo Computer
0


గుజరాత్‌ ఎన్నికల్లో సోమవారం ప్రధాని మోదీ ఓటేయడానికి వచ్చిన తీరుపై కాంగ్రెస్‌, ఇతర పార్టీలు మండిపడ్డాయి. అహ్మదాబాద్‌లో నిషాన్‌ హైస్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి ఉదయం 9.30కి ఆయన వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజలు బారులు తీరారు. కాసేపు క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి ఓటేసినందుకు గుర్తుగా వేలికి వేసిన సిరాను చూపుతూ.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భద్రతా సిబ్బంది, కాన్వాయ్‌లోని వాహనాలు ఆయన్ను అనుసరించాయి. అనంతరం అక్కడికి సమీపంలోని తన అన్న సోమ్‌భాయ్‌ మోదీ ఇంటికి వెళ్లారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. ఓటింగ్‌ రోజున మోదీ రాజకీయ రోడ్‌షో నిర్వహించారని ఆరోపించింది. దీనిపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిష్ర్కియగా వ్యవహరించిందని విమర్శించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)