తెలంగాణకు బల్క్‌ డ్రగ్‌ పార్కు

Telugu Lo Computer
0


తెలంగాణకు బల్క్‌ డ్రగ్‌ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ వెల్లడించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ నామ నాగేశ్వరరావు తెలంగాణలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు.. కేంద్రమంత్రి సమాధానమిస్తూ దేశంలో 12 వేలకుపైగా ఫార్మా సంస్థలున్నాయని వివరించారు. పీఎల్‌ఐ పథకంలో భాగంగా 2020-21 నుంచి 2024-25 మధ్య దేశంలో మూడు చోట్ల బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పార్కుకు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కులకు ఆమోదం తెలిపామన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)