విజయానికి నాలుగు వికెట్ల దూరంలో టీమిండియా

Telugu Lo Computer
0


భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసేసరికి 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. చివరి రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా.. భారత్‌ మరో నాలుగు వికెట్లను తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (9) ఉన్నారు. తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ (100) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3.. ఉమేశ్‌, కుల్‌దీప్‌, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)