నా కూతుర్ని కూడా వదలరా ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 28 December 2022

నా కూతుర్ని కూడా వదలరా ?


ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి రోజా ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సినిమాలు, రాజకీయాల పరంగా తాను ఎదుర్కొంటోన్న ఒడిదొడుకులను పంచుకున్నారు. ముఖ్యంగా తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియా వేదికగా కొందరు చేస్తోన్న ట్రోల్స్ గురించి చెప్పి ఎమోషనల్‌ అయ్యారు. తన కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్ అన్నారు. తనది చాలా మృదు స్వభావమని. అలాంటిది సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చూసి తన కుమార్తె చాలా బాధపడింది. ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీద తనను ప్రశ్నించిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన కూతురుని మాత్రమే కాదని, తన కుటుంబ సభ్యులు ఎవరినీ వదలడం లేదన్నారు. తనలాగే తన సోదరుడి గురించి కూడా అభ్యంతరకరంగా మాట్లాడారన్నారు. అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణమని తన పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాను అన్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

No comments:

Post a Comment