ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు

Telugu Lo Computer
0


సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కుమారుడు రవిబాబు చలపతిరావుకు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన కుటుంబసభ్యులతోపాటు  మంచు మనోజ్, సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, బోయపాటి శ్రీను,  శ్రీవాస్, గౌతమ్ రాజు.. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నెల 24న గుండెపోటుతో చలపతిరావు కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు రాక ఆలస్యం కావడంతో ఆయన భౌతికకాయాన్నిమహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ లో ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన భౌతకకాయాన్ని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు కుటుంబసభ్యులు నిర్వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)