గుజరాత్‌ పోలింగ్‌ 60.23%

Telugu Lo Computer
0


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. గురువారం కచ్‌-సౌరాష్ట్ర, దక్షిణ గు జరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 60.23 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ దఫా దాని కంటే 6.54 శాతం తగ్గడం విశేషం. ఇది ఎవరి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందోనని పార్టీల్లో ఆందోళన నెలకొంది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 72.32 శాతం ఓటింగ్‌తో గిరిజన ప్రాబల్య తాపీ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. సౌరాష్ట్రలోని భావనగర్‌లో అతి తక్కువగా 51.34 శాతం పోలింగ్‌ జరిగినట్లు తెలిపింది. కాగా, ఈవీఎంల రక్షణ బాధ్యతను గుజరాత్‌ పోలీసులకు అప్పగించడంపై కాంగ్రెస్‌ మండిపడింది. ఎన్నికల్లో భద్రతకు నియమించిన త్రిపుర స్టేట్‌ పోలీసు బలగాలకు ఈవీఎంలకు దూరంగా ఉండాలని ఆదేశాలిచ్చారని, దీనిపై విచారణ జరపాలని ఈసీకి ఆ పార్టీ లేఖ రాసింది. కాగా, ధరల పెరుగుదలను నిరసిస్తూ గుజరాత్‌ ఓటర్లు కొందరు పోలింగ్‌ కేంద్రాలకు గ్యాస్‌ సిలిండర్లను వెంట తీసుకురావడం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)