జనవరి 26న "బుట్ట బొమ్మ" విడుదల - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 17 December 2022

జనవరి 26న "బుట్ట బొమ్మ" విడుదల


సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం "బుట్ట బొమ్మ"అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగవంశీ ఎస్‌. సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న "బుట్ట బొమ్మ" విడుదల తేదీ ప్రచార చిత్రం ను ఈ రోజు అధికారికంగా సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే. ఆకట్టుకోవడంతో పాటు, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ.'బుట్ట బొమ్మ' గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.'ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు. చిత్రం లోని ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం కథానుగుణంగా ఆకట్టుకుంటుంది. అలాగే పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రం పై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. వీటితో పాటు వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయి అని నమ్మకంగా చెప్పొచ్చు. సంభాషణల రచయిత గా ' వరుడు కావలెను' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సంభాషణల్లో తనదైన బాణీ పలికించటానికి ఆయన పడే తపన ఈ చిత్రంలో స్పష్టమవుతుంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26 న విడుదల అవుతున్న ఈ చిత్రం సినీ అభిమాన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, అలరిస్తుందని తెలిపారు నిర్మాతలు. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగానటిస్తున్న ఈ చిత్రంలో నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు పోషిస్తున్నారు.

No comments:

Post a Comment