చైనాలో 20 రోజుల్లో 250 మిలియన్ల కరోనా కేసులు ?

Telugu Lo Computer
0


చైనాలో డిసెంబర్‌ మొదటి 20 రోజుల్లోనే 25 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక ఈసారి లీక్ అయింది. చైనా ఆరోగ్య సంస్థ ‘ఎన్‌హెచ్‌సి’ సమావేశం నుండి లీక్ అయిన పత్రాలను చూసినట్లు అమెరికన్ న్యూస్ ఛానెల్ సిఎన్‌ఎన్ పేర్కొంది. జిన్‌పింగ్ ప్రభుత్వ రహస్య డేటా లీక్ కావడంతో చైనాలో కలకలం రేగింది. చైనాలో కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో లీక్ అయిన నివేదికను బట్టి అంచనా వేయవచ్చు. కరోనాతో చైనా పరిస్థితి దారుణంగా మారింది. చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ మొదటి 20 రోజుల్లో 250 మిలియన్లకు బదులుగా 62,592 కొత్త కోవిడ్ కేసులను మాత్రమే నివేదించిందని సీఎన్‌ఎన్‌ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికల ప్రకారం, డిసెంబర్ మొదటి 20 రోజుల్లోనే చైనాలో దాదాపు 250 మిలియన్లు మంది ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చని చైనా ఉన్నత ఆరోగ్య అధికారులు అంతర్గతంగా అంచనా వేసింది. ఈ గణాంకాలు బుధవారం చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అంతర్గత సమావేశంలో సమర్పించబడ్డాయి. ఈ గణాంకాలు సరైనవే అయితే, 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో 18 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారని అర్థం. ప్రపంచంలోని ఏ దేశం నుండి కోవిడ్ సోకిన వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ.

Post a Comment

0Comments

Post a Comment (0)