గుజరాత్‌లో వెలుగు చూసిన ఒమిక్రాన్ BF-7 వేరియంట్ !

Telugu Lo Computer
0

గుజరాత్‌లోని వడోదరలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఒమిక్రాన్ BF-7  వేరియంట్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. జీనోమ్‌ సీక్వెనింగ్‌లో వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గుర్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటివరకు భారత్‌లో ఒమిక్రాన్‌ BF-7 వేరియంట్‌ కేసులు మూడు నమోదయినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒరిస్సాలో వెలుగుచూసింది. దీంతో వైద్యారోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌ టెస్ట్‌లు చేయాలని కేంద్రం ఆదేశించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కంపల్సరీగా కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులు ఆదేశించారు. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే గుణం ఉంది ఈ వేరియంట్‌కు. ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా తక్కువ. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ అత్యున్నత స్ధాయి సమీక్ష నిర్వహించింది. కరోనా ముప్పు ఇంకా పోలేదని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. రద్దీ ప్రాంతాల్లో జనం మాస్క్‌లను ధరించాలని కేంద్రం సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ప్రతి ఒక్కరు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించింది. కొత్త వేరియంట్‌ కారణంగా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టులో టెస్ట్‌లను కంపల్సరీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)