ఇరుముడిని విమాన క్యాబిన్‌ లగేజీలో తీసుకెళ్లవచ్చు !

Telugu Lo Computer
0


విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌-బీసీఏఎస్‌ వెసులుబాటు కల్పించింది. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని క్యాబిన్‌ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. అన్ని తనిఖీల తర్వాత... అయ్యప్ప భక్తులు తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్‌లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల సెక్యురిటీ సిబ్బందికి బీసీఏఎస్‌ మార్గదర్శకాలు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 20 వరకూ విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకూ అవకాశం కల్పిస్తూ... బీసీఏఎస్‌ డైరక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)