నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్టు

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా ఉగ్రవాదుల డంప్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. బందిపొరాలో ఉగ్రవాదుల డంప్ ను గుర్తించిన పోలీసులు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ మహిళతోపాటు నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అరెస్టు అయిన ఉగ్రవాదుల్లో ముసేబ్ మీర్ రాఖ్ హజిన్, అరాఫత్ ఫరూఖ్ వాగే, డాక్టర్ ఆదిల్ గా పోలీసులు గుర్తించారు. కే -47 రైఫిల్, మరో ఏకే-56 రైఫిల్, నాలుగు ఏకే సిరీస్ మ్యాగజైన్స్, లైవ్ రౌండ్లు, ఆర్డీఎక్స్ పౌడర్, బ్యాటరీలు, డిటోనేటర్లు, రీమోట్ కంట్రోళ్లు, వైరు, ఐరన్ పైపులను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ పోలీసులు చెప్పారు. రెండు హ్యాండ్ గ్రెనెడ్లతో ఉగ్రవాదులను అరెస్టు చేశామని కశ్మీర్ ఎస్పీ చెప్పారు. ఈ ఉగ్రవాదులు పీఓకేకి చెందిన ఎల్‌ఈటీ టెర్రరిస్టు కమాండర్ సమామా నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.పౌరులపై దాడులు చేయాలని, పేలుళ్లు జరిపి ప్రజల్లో భయం సృష్టించాలని ఉగ్రవాదులు వ్యూహం పన్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)