రాజకీయాలలో మతతత్వం, కులతత్వం పెరిగిపోయాయి !

Telugu Lo Computer
0


మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ  ఒక తిరోగమనం స్పష్టంగా కనపడుతోందని చెప్పారు. రాజకీయాల్లో మతతత్వం, కుల తత్వం, ధన బలం, ఎమ్మెల్యేలతో బేరసారాలు, చవకబారు భాషలో మాట్లాడడం లాంటి దుర్లక్షణాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలని, ఇప్పటికైనా మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత తాను ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళుతున్నానని, దేశంలో మంచి రాజకీయాల కోసం ఏం చేయాలి అన్న విషయంపై చర్చ రేకెత్తిస్తున్నానని ఆయన తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)