కనువిందు చేస్తున్న బ్లడ్‌మూన్

Telugu Lo Computer
0


ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైంది. తూర్పు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించగా.. మన దగ్గర మాత్రం పాక్షిక గ్రహణమే చూడవచ్చని సైంటిస్టులు చెప్పారు. బ్లడ్ మూన్ అంటే కాబట్టి చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇక సూర్యగ్రహణం చూసేందుకు అయితే ప్రత్యేక పరికరాలు అవసరం కానీ చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని చెప్పారు. కాగా, ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం కారణంగా చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. భూమి నీడ పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ వర్ణంలో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. మంగళవారం చంద్ర గ్రహణం ముగిసిందంటే మళ్లీ కనిపించేది 2025లోనే. దేశంలో 2025 సెప్టెంబర్ 7న తిరిగి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే, పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023 అక్టోబర్‌లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)