ఢిల్లీలో ఎగిరే పళ్లెం ఫోటో వైరల్

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఎగిరే పళ్లెం ఫోటో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. గ్రహంతరవాసుల సందర్శన గురించిన కథనాలు కూడా విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. భవనాలపై ఆకాశంలో భారీ సాసర్‌ చిత్రాన్ని ప్రచారం చేశారు. గ్రహాంతర కథనాలు విస్తృతంగా వ్యాపించడంతో, నిజం ఏమిటో స్పష్టం తెలుసుకోవడం కోసం కొందరు సోషల్ మీడియా ద్వారా లోతైన పరిశోధన చేసి అసలు మిస్టరీని చేధించారు. అది ఎగిరే పళ్లెం కాదని, విపరీతమైన వాయు కాలుష్యం అని కనిపెట్టారు. వాయుకాలుష్యం కారణంగా ఫ్లయింగ్‌ సాసర్‌ల కనిపించే భారీ తాగునీటి ట్యాంక్‌ చిత్రం. ట్యాంక్‌పై భాగం మాత్రమే కనిపిస్తుంది. వాయు కాలుష్యంతో దిగువ భాగం మరుగున పడింది. దీంతో ట్యాంక్‌ గాలిలో ఎగిరే పళ్లెంలా తయారైందని తేలింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)