అమికస్‌ క్యూరీని నియమించిన సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


చట్టసభల్లో ఓటు వేయడానికి లంచం తీసుకున్న ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టకుండా రాజ్యాంగ రక్షణ ఉందా అన్న విషయమై సలహాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం అమికస్‌ క్యూరీని నియమించింది. పార్లమెంటు/అసెంబ్లీల్లో చేసే ప్రసంగాలు, వేసే ఓటు కోసం సొమ్ము తీసుకుంటే వారిపై విచారణ జరపవచ్చా అన్నదానిపై సలహాలు ఇచ్చేందుకు సీనియర్‌ న్యాయవాది పి.ఎస్. పట్వాలియాను కోర్టు సహాయకునిగా నియమిస్తున్నట్టు తెలిపింది. ఆయనకు సహకారం అందించాలని న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌కు సూచించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఎ.ఎ్‌స.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై డిసెంబరు 6న విచారణ జరపనున్నట్టు తెలిపింది. ఈ విషయం తొలుత 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ముందుకు వచ్చింది. కేసు చూపే ప్రభావం, ప్రాధాన్యం దృష్ట్యా ఐదుగురు సభ్యుల ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇలాంటి విషయమై 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. జేఎంఎం నేత శిబు సొరేన్‌ ముడుపులపై సీబీఐ కేసు పెట్టింది. సభలో జరిగిన కార్యకలాపాలు కోర్టుల పరిధిలోకి రావని, ఆ విషయాల్లో సభ్యులకు రాజ్యాంగ రక్షణ ఉందని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి విస్తృతమైన అంశాలు ఉన్న నేపథ్యంలో కోర్టు అమికస్‌ క్యూరీని నియమించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)