ఎలక్ట్రిక్‌ వాహనాలకు పర్మిట్‌ ఉచితం !

Telugu Lo Computer
0


ఆలిండియా టూరిస్ట్‌ పర్మిట్‌ రుసుము తగ్గనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉచితంగానే పర్మిట్‌ లభించనుంది. ఇందుకు సంబంధించి ఆలిండియా టూరిస్ట్‌ వెహికల్స్‌ పర్మిట్‌, 2021 నిబంధనలను కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సవరించింది. నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసి 11వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాహన సిటింగ్‌ సామర్థ్యం ఆధారంగా పర్మిట్‌ ఫీజును వసూలు చేయనున్నారు. ఫీజును విడతల వారీగా చెల్లించే విధానాన్ని కూడా ప్రతిపాదించారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు తెలియజేసేందుకు 30 రోజులు గడువిచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)