పాదరక్షలు వేసుకుని నివాళులర్పించిన మహారాష్ట్ర గవర్నర్ !

Telugu Lo Computer
0

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాన్లకు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించే సమయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్‌యారి పాదరక్షలు వేసుకుని ఉండటం ఈ వివాదానికి కారణమైంది. ఈ చర్యను మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. పాదరక్షలు తీసివేసి శ్రద్ధాంజలి ఘటించడం అనేది భారతీయ సంస్కృతి అని, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర సంస్కృతని ఎంపీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రతినిధి సచిన్ సావంత్ అన్నారు. మహారాష్ట్ర సంస్కృతిని, మహారాష్ట్ర ప్రముఖులను తరచూ గవర్నర్ అగౌరపరచడాన్ని తప్పుపట్టారు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలర్పించిన వీరజవాన్లకు దేశవ్యాప్తంగా శనివారంనాడు నివాళులర్పించారు. సౌత్ ముంబైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అమరవీరుల స్మారకం వద్ద గవర్నర్ కోష్‌యారితో పాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నివాళులర్పించారు. గవర్నర్ పాదరక్షలు ధరించే నివాళులర్పించగా, షిండే మాత్రం కొద్దిదూరంలో పాదరక్షలు విప్పి అనంతరం స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)