ఉసురు తీసుకున్న 108 వాహనం ?

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ లోని బన్స్వారా  జిల్లా దనపూర్ ప్రాంతంలో  40 ఏళ్ల తేజియ అనే వ్యక్తి స్పృహతప్పడంతో బంధువులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రాగానే పేషెంట్‌ను అందులో ఎక్కించారు. వాహనం వెళ్తుండగా అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంధనం లేకపోవడంతో ఆగిపోయిన వాహనాన్ని కుటుంబ సభ్యులు ముందుకు నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సకాలంలో వైద్యం అందక తేజియ కన్నుమూశాడు. ఈ ఘటనపై బన్స్వారా సీఎంహెచ్ఓ మాట్లాడుతూ, ఘటన సమాచారం తెలియగానే వెంటనే విచారణ చేపట్టినట్టు చెప్పారు. బాధితుడి కుటుంబీకులను కలిసి, నిర్వాహకుల నిర్లక్ష్యం గురించి వాకబు చేస్తున్నట్టు తెలిపారు. 108 వాహనాన్ని ప్రైవేటు ఏజెన్సీ నడుపుతోందని, అంబులెన్స్ మెయింటెనెన్స్ బాధ్యత వారిదేనని అన్నారు. రాష్ట్ర మంత్రి పీఎస్ ఖచరియావాస్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్యచికిత్స అందిస్తోందని, అంబులెన్స్‌లో ఇంధనం లేకపోవడం వల్ల పేషెంట్ మరణిస్తే అది యాజమాన్య వైఫల్యమే అవుతుందని, వ్యవస్థ లోపం కాదని అన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)