వచ్చే బడ్జెట్ లో 400 కొత్త రైళ్లు ?

Telugu Lo Computer
0


వచ్చే బడ్జెట్‌లో భారతీయ రైల్వేల కేటాయింపులో 300 నుంచి 400 వరకు కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ 2024 మొదటి త్రైమాసికంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలును విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే మూడేళ్లలోపు రైల్వే ట్రాక్‌లపై 475 వందే భారత్ రైళ్ల తీసుకొచ్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని వెల్లడించారు. ''475 వందేభారత్ రైళ్లను ట్రాక్‌లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. గతేడాది బడ్జెట్‌లో 400 రైళ్లు మంజూరవ్వగా.. అంతకుముందు 75 రైళ్లు మంజూరు చేయబడ్డాయి. రాబోయే మూడేళ్లలో మేము మా లక్ష్యాన్ని చేరుకుంటాం'' అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఢిల్లీ – ముంబై, ఢిల్లీ – హౌరా, ఇతర ప్రధాన మార్గాలలో ప్రస్తుతమున్న రాజధాని, దురంతో, శతాబ్దితో పాటు ఇతర సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దశలవారీగా తొలగించి.. వాటి స్థానంలో ఈ వందే భారత్ రైళ్లను తీసుకురావాలనే విజన్‌తో కేంద్రం పని చేస్తోంది. మరోవైపు.. 2025-26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాలోని మార్కెట్‌లకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేసేందుకు భారతీయ రైల్వేలు ప్రణాళికలు వేస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)