చేనేత వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్ లో నిరసన

Telugu Lo Computer
0


చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించటాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం తీవ్రంగా నిరసిస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జీఎస్టీని మాఫీ చేయించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. మరో నెల రోజుల్లో గుజరాత్ ఎన్నికలు ఉండటంతో ఇక్కడ నిరసనలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని మోడీకి దృష్టికి సమస్య ను తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి చెప్పారు. ఇప్పటికే సబర్మతి ఆశ్రమంలో నిరసన చేపట్టామన్నారు. తాజాగా సూరత్ లోని గాంధీ పార్కులో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేశారు. అనేక నిర్బంధాల మధ్య జీఎస్టీ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత, నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్, చెలమళ్ళ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)