ఆదివాసీలు వనవాసిల పదానికి చాలా తేడా ఉంది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 20 November 2022

ఆదివాసీలు వనవాసిల పదానికి చాలా తేడా ఉంది !


మహారాష్ట్రలోని బుల్థానా జిల్లాలోని జల్గావ్ జమోద్‌లో ఆదివాసీ మహిళా కార్యకర్తల సమ్మేళనం ఉద్ధేశించి భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రసంగిస్తూ  గిరిజనుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదని, ఇది చాలా తీవ్ర విషయం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం, భూ హక్కులు , పంచాయతీరాజ్ చట్టం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ల వంటి వాటిలో అంతా కుడిఎడమల దగా వ్యవహారం సాగుతోందని విమర్శించారు. ప్రధాని మోడీ గిరిజనులను పలు రకాలుగా పిలుస్తారని వారిని వనవాసీలు అంటాడు. ఆదివాసీలు వనవాసిల పదానికి చాలా తేడా ఉందని రాహుల్ తెలిపారు. వనవాసిలని వారిని సంబోధించడం ద్వారా ప్రధాని మోడీ గిరిజనులను వారు ఎప్పుడూ అడవి మనుష్యులుగా ఉండాలని నిర్ధేశిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. వారిని అటవీప్రాంతానికి పరిమితం చేయడం, వారు నగరాల ప్రవేశానికి నిషిద్ధం, వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు రాకూడదు, వారు జీవితకాలంలో విమానాలు ఎక్కే పరిస్థితి రాకూడదనేదే బిజెపి నేతల పెద్ద ఆలోచన అని రాహుల్ స్పందించారు. ఆదివాసీలు అంటే ఈ దేశానికి ఆది వ్యక్తులు వారిదే ఈ దేశం, ఈ దేశానికి వారే యజమానులు అని తనకు తన నానమ్మ ఇందిరా గాంధీ తరచూ చెపుతూ ఉండేదని రాహుల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గిరిజనుల చరిత్రను, వారి సంస్కృతిని తెలుసుకోలేకపోతే ఇక ఈ దేశం గురించి ఏం చెపుతారు? ఏం పాలిస్తారని బిజెపికి రాహుల్ చురకలు పెట్టారు.

No comments:

Post a Comment