భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడటంతో ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీని కలవడానికి ప్రజలు పెద్దసంఖ్యలో తరలి రావడంతో రద్దీ ఏర్పడింది. పోలీసులు జనాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో యాత్రలో తొక్కిసలాట జరిగింది. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రభంజనం చూసి బీజేపీ భయపడి యాత్ర పరువు తీసేందుకు యత్నిస్తుందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)