కూతుర్ని గొంతుకోసి చంపిన తల్లి !

Telugu Lo Computer
0


తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో అరుణ అనే విద్యార్థిని చదువుతుంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఇదే సమయంలో అరుణుకు ఇంటి వద్ద పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న అరుణ తన తల్లి ఆరుముగకాని కి ఫోన్ చేసి తన ప్రేమ గురించి చెప్పింది. దీంతో ఆమె తల్లి అరుణను వెంటనే ఇంటి రావాల్సిందిగా కోరింది. అరుణ ఇంటి రాగానే ఆరుముగకాని ప్రేమ పెళ్లి వద్దని చెప్పింది. తాను ఓ పెళ్లి సంబంధం చూశానని అతన్నే వివాహం చేసుకోవాలని కోరింది. అయితే అరుణ పెళ్లిని వ్యతిరేకించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన తల్లి కూతురిని గొంతుకోసి హత్య చేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. వారిని గమనించిన చుట్టు పక్కల వారు వారిని చికిత్స నిమిత్తం వారిద్దరినీ తిరునల్వేలి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకోగానే అరుణ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆరుముగకానిఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అరుణ తండ్రి, సోదరుడు ప్రస్తుతం చెన్నైలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుల హత్య కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)