తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 18 November 2022

తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతం


హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్‌-సబ్‌ ఆర్బిటల్‌ (వికెఎస్‌) రాకెట్‌ను శ్రీహరికోట నుండి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విజయవంతంగా  నింగిలోకి ప్రవేశపెట్టారు.  'విక్రమ్‌-ఎస్‌ గగనతలాన్ని అలంకరించిన భారతదేశపు మొదటి ప్రైవేట్‌ రాకెట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ మహత్తరమైన సందర్భంగా మాతో ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు'' అని వికెఎస్ ఒక ట్వీట్‌లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2020 నుండి అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్‌ రాకెట్‌లకు అనుమతించినసంగతి తెలిసిందే. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలను ప్రారంభించిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయికి నివాళిగా తమ రాకెట్‌కు 'విక్రమ్‌-ఎస్‌' అని పేరు పెట్టినట్లు వికెఎస్ తెలిపింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు 'ప్రారంభ్‌' అని నామకరణం చేశారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌.. సింగిల్‌ స్టేజ్‌ సబ్‌-ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్‌ మూడు పెలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. ఒకటి విదేశీ సంస్థకు చెందినది కాగా.. రెండు మన దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్‌కిడ్జ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల 'ఫన్‌-శాట్‌' పేలోడ్‌. దీనిని మన దేశంతో పాటు, అమెరికా, సింగపూర్‌, ఇండోనేసియా విద్యార్థులు రూపొందించారు. 

No comments:

Post a Comment