యువకుడిపై అత్యాచారం ?

Telugu Lo Computer
0


పంజాబ్ లోని జలంధర్ లో నలుగురు అమ్మాయిలు ఓ యువకుడిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జలంధర్ కపూర్తలా ప్రాంతంలో లెదర్ కాంప్లెక్స్ రోడ్డులో చోటుచేసుకుంది. బాధితుని కథనం ప్రకారం లెదర్ కాంప్లెక్స్ రోడ్లో ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువకుడు మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో అతని పక్కగా రోడ్డుపై ఓ కారు ఆగిందని, కారులో ప్రయాణిస్తున్న నలుగురు అమ్మాయిలు అతనిని ఓ అడ్రెస్ అడిగారని తెలిపాడు.  అడ్రస్సు చెప్పడానికి అతనిని కారులో ఎక్కించుకున్నారని చెబుతున్నాడు. ఆ తరువాత నలుగురు యువతులు కారులోనే ఒకరి తర్వాత ఒకరు తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని యువకుడు చెబుతున్నాడు. ఆ తర్వాత వారు కారు నుండి అతడిని దించి వెళ్లిపోయారని చెప్తున్నాడు. కారులో తిప్పుతూ తనపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువతుల వయసు 22 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉంటుందని యువకుడు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి పోలీస్ కేసు ఇప్పటి వరకు నమోదు కాలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)