ఐక్యూ ఫోన్‌ చేస్ - హెడ్‌ అండ్‌ షోల్డర్‌ షాంపు డెలివరీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం పాతూరు భాగ్యనగర్‌కు చెందిన మస్తాన్‌వలి ఈ నెల 14న ఫ్లిప్‌కార్ట్‌లో రూ.34 వేలు విలువ చేసే ఐక్యూ ఫోన్‌ బుక్‌ చేశారు. ఈ నెల 17న డెలివరీ బాయ్‌ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి వచ్చిన బాక్సును ఇచ్చి వెళ్లాడు. బాక్సు బరువుగా ఉండటంతో బాధితునికి సందేహం వచ్చి వీడియో తీస్తూ తెరిచారు. చరవాణికి బదులు హెడ్‌ అండ్‌ షోల్డర్‌ షాంపు ఉండటంతో కంగుతిన్నారు. వెంటనే ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. డెలివరీ చేసిన స్టోర్‌ మేనేజర్‌ కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్టోర్‌ మేనేజర్‌ను ఆరా తీయగా రెండు మూడు రోజుల్లో బాధితుడికి డబ్బులు రీఫండ్‌ అవుతాయని తెలిపారు. ఇటీవల నగరానికి చెందిన ఓ యువకుడు రూ.2 వేలు విలువ చేసే స్మార్ట్‌వాచ్‌ బుక్‌ చేయగా, రూ.500 విలువ చేసే సాధారణ వాచీ డెలివరీ చేసినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)