పూణే - బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం !

Telugu Lo Computer
0


పూణే - బెంగళూరు జాతీయ రహదారిపై నేవల్ వంతెన వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ఓ ట్యాంకర్ వాహనాలపై దూసుకెళ్లడంతో 48 కార్లు దెబ్బతిన్నాయి. ఈ పెద్ద రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. పూణె అగ్నిమాపక దళం, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీల రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి హైవేపై వేగంగా వస్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయి పలు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ట్యాంకర్ నుంచి ఆయిల్ కింద పడటంతో పలు కార్లు జారి ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంతతో ముంబయి వెళ్లే రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. ప్రమాదంలో గాయపడిన వారు ఈ ఘోర ప్రమాదాన్ని చిత్రీకరించి ట్విట్టరులో వీడియో పోస్టు చేశారు. పూణే ఘోర రోడ్డుప్రమాదం వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకు షేర్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)