పెరుగుతున్న డీమ్యాట్​ ఖాతాలు !

Telugu Lo Computer
0


ఈక్విటీ మార్కెట్ల నుండి ఆకర్షణీయమైన రాబడుల కారణంగా డీమ్యాట్​ ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో వీటి సంఖ్య 10.4 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరం అక్టోబరుతో పోలిస్తే ఇది 41 శాతం అధికం. అయితే గత కొన్ని నెలలుగా ఇంక్రిమెంటల్​ యాడిషన్స్ మాత్రం నెమ్మదిస్తున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లెక్కల ప్రకారం, కొత్త డీమ్యాట్​ ఖాతాలు ఈ ఏడాది ఆగస్టు నుండి నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. ఈ ఆగస్టులో వీటి సంఖ్య 26 లక్షలు కాగా, సెప్టెంబర్‌లో 20 లక్షలకు పడిపోయాయి. ఇదే ఏడాది అక్టోబర్ నాటికి 18 లక్షలకు తగ్గాయి. 2021 అక్టోబరులో ఇవి 36 లక్షలు పెరిగాయి. కొత్త డీమ్యాట్ ఖాతాలు తగ్గుముఖం పట్టడానికి మార్కెట్లో ఆటోపోట్లు, ప్రపంచ మార్కెట్లు మాంద్యంవైపు పయనించడం, ఇన్​ఫ్లేషన్​ ఇందుకు కారణాలు. ఫ్రంట్‌లైన్ సూచీలతో పోలిస్తే బ్రాడ్​ మార్కెట్ల పనితీరు బాగాలేదని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ సీఈఓ రూప్ భూత్రా అన్నారు. 2021తో పోలిస్తే ఈ సంవత్సరం మార్కెట్‌లలోకి వచ్చిన ఐపీఓలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. గత కొన్ని నెలల్లో తక్కువ సంఖ్యలో డీమ్యాట్ ఖాతాలు రావడానికి ఇదో కారణం. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రీసెర్చ్-బ్యాంకింగ్ & ఇన్స్యూరెన్స్, ఇన్​స్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ గ్రూప్ వైస్​-ప్రెసిడెంట్​, నితిన్ అగర్వాల్ మాట్లాడుతూ, జనవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మార్కెట్ అస్థిరత పెరగడంతో ఖాతాల సంఖ్య తగ్గడం మొదలయిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇన్​ఫ్లేషన్​, వడ్డీ రేట్ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇలాంటి అనిశ్చితి కారణంగా, కొత్త వాళ్లు మార్కెట్లలోకి రావడం లేదని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)